తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు.నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేసి రాత్రి పహారా మరింత కట్టుదిట్టం.రహదారులపై విస్తృతంగా వాహనాల తనిఖీలు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై నిఘా.హైవేలతో పాటు నగరాలు,గ్రామాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు.ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్.ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా రాత్రి సమయంలో నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి,ప్రతి ప్రాంతంలో పోలీసుల పహారాను పెంచారు.ఇందులో భాగంగా రహదారులపై విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా హైవేలతో పాటు నగరాలు,గ్రామాలకు ప్రవేశించే మార్గాల్లో కూడా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి,వాహనాల రాకపోకలను సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజల భద్రతే పోలీసుల ముఖ్య లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.