
ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) ఇబ్రహీంపట్నం,ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,ఎస్,వి,రాజశేఖర్ బాబు,ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం,సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం,డైరెక్టుగా రంగంలోకిదిగారు,ఇకనుంచి ప్రమాదాలను అరికట్టడమూ లో భాగంగా టిప్పర్లు కంపెనీ ఇచ్చిన పరిమితికి మించి ఓ వర్ లోడ్లు రవాణా చేస్తూ,పట్టా కట్టకుండా లారీలు నడుపుతూ విచక్షణ రహితంగా,నేషనల్ హైవే పై ద్విచక్ర వాహనదారులకు,కార్లకు అత్యంత ప్రమాదకరంగా రవాణా చేసే వాహనాలపై చర్యల్లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్,నేరుగా రంగంలోకి దిగి సుబ్రహ్మణ్యం,ఫైన్లు వేశారు.అనుమతులకు మించి రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు.అనంతరం ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్,సుబ్రహ్మణ్యం,ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్లో,టిప్పర్ లారీల ఓనర్స్కు,డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ వారికి ఇకనుంచి ఇది మొదలుకొని ఎవరూ కూడా పోలీసు వారి ఆదేశాలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ప్రాణన నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు,ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.