prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 3:30 pm Digital Edition : RAJASHEKARREDDY

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం – సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్

బెజ్జంకి, జూలై 1(ప్రజావాణి )

 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కేంద్రాలను సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు సమర్థవంతంగా ఉపయోగపడటంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రతను కల్పిస్తుందని అన్నారు.అనంతరం  సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ మల్లయ్య నాలుగు సీసీ కెమెరాలు, ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య–మోహన్ ఎనిమిది సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసినందుకు వారిని సీఐ విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై తోట తిరుపతి, ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య–మోహన్, కొంకటి సంపత్, కొంకటి కుమార్, పంతంగి వెంకటేష్, ర్యాకం అనిత, పోతు భూలక్ష్మి, గుగ్గిళ్ల లావణ్య, కొంకటి సురేష్, దూశెట్టి రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వంశీ, కారోబార్ అశోక్, పోలీసు అధికారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.