prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 9:26 am Digital Edition : PRAJA VANI

నేత్రదాత కొంక నర్సయ్యకు ఘన నివాళి అవయవ నేత్రదానంపైపలువురి జీవితాల్లో వెలుగులు

నేత్రదాత కొంక నర్సయ్యకు ఘన నివాళి అవయవ నేత్రదానంపైపలువురి జీవితాల్లో వెలుగులు

* ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్

* సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి

జమ్మికుంటజూలై 11 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముకుల గ్రామంలో నేత్రదాత కొంక నర్సయ్య సంస్మరణ సభను శనివారం వారి నివాసంలో ఘనంగా నిర్వహించారుసదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణానంతరం నేత్రాలు అవయవాలు శరీరాన్ని దానం చేయడం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారుప్రతి ఒక్కరూ అవయవ నేత్రదానంపై అవగాహన పెంపొందించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.అనంతరం నేత్రదాత కొంక నర్సయ్య కుటుంబ సభ్యులు భార్య కొంక సత్యమ్మ కుమార్తెలు హరికృష్ణమణెమ్మ ఇంద్రసేనపద్మ, కొంక సతీష్‌లను సదాశయ ఫౌండేషన్ జ్ఞాపికతో సత్కరించి అభినందనలు తెలిపారు.సదాశయ ఫౌండేషన్ గోదావరిఖని పట్టణ అధ్యక్షురాలు కొంక అన్నపూర్ణ మాట్లాడుతూ కొంక నర్సయ్య కుటుంబం చూపిన సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు అవయవాలను దానం చేసి మానవజన్మను సార్థకం చేసుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు ఆకుల రాజేందర్ మేరుగు సారంగం ఆలయ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ గాదె గుణసాగర్ కొంక ముత్తయ్యతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.