నేతల కాళ్లదగ్గర ‘సాగిలపడదామా’? అవినీతిపై ‘సింహగర్జన’ చేద్దామా? విలేకరులారా.తేల్చుకోండి!

ప్రజావాణి జూన్ 01 అమరావతి  మైకులు  పట్టుకుని ‘భజన’చేసే బానిసత్వం చాలు.కలం పట్టి పాలకుల ‘గుండెల్లో రైళ్లు’ పరిగెత్తించే చైతన్యం రావాలి పత్రికా విలేకరి అంటే సమాజానికి కాపలా కుక్క. కానీ ఈ రోజుల్లో కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే జర్నలిజం అనే పదానికే సిగ్గుచేటుగా మారుతోంది. "మేము రిపోర్టర్లం" అని చెప్పుకుంటూ, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కనిపించగానే వారి చుట్టూ చేరి ‘జీ హుజూర్’ అంటూ మోకరిల్లడం జర్నలిజం కాదు, అది బతుకుదెరువు కోసం చేసే బానిసత్వం!​అధికార బలం,అంగబలంతో కొందరు నేతలు...