prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 2:11 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నేతల కాళ్లదగ్గర ‘సాగిలపడదామా’? అవినీతిపై ‘సింహగర్జన’ చేద్దామా? విలేకరులారా.తేల్చుకోండి!

ప్రజావాణి జూన్ 01 అమరావతి  మైకులు  పట్టుకుని ‘భజన’చేసే బానిసత్వం చాలు.కలం పట్టి పాలకుల ‘గుండెల్లో రైళ్లు’ పరిగెత్తించే చైతన్యం రావాలి పత్రికా విలేకరి అంటే సమాజానికి కాపలా కుక్క. కానీ ఈ రోజుల్లో కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే జర్నలిజం అనే పదానికే సిగ్గుచేటుగా మారుతోంది. “మేము రిపోర్టర్లం” అని చెప్పుకుంటూ, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కనిపించగానే వారి చుట్టూ చేరి ‘జీ హుజూర్’ అంటూ మోకరిల్లడం జర్నలిజం కాదు, అది బతుకుదెరువు కోసం చేసే బానిసత్వం!​అధికార బలం,అంగబలంతో కొందరు నేతలు నియోజకవర్గాలను దోచుకుంటుంటే… వారి అక్రమాలను కెమెరాల్లో బంధించాల్సిన చేతులు, వారికి సలాం కొట్టడానికి లేస్తుండటం ఘోరం. ఈ బానిస మనస్తత్వం మారాలి.విలేకరుల్లో అణగిపోయిన సింహస్వప్నం లాంటి చైతన్యం ఇకనైనా నిద్రలేవాలి!​అధికార దర్పానికి లొంగిపోతే.చరిత్ర క్షమించదు ఎమ్మెల్యేలు చేసే ఇసుక దందాలు,భూకబ్జాలు, మట్టి దందాలు,కాంట్రాక్టుల అవినీతిపై గళం విప్పకుండా. వారిచ్చే చిన్న చిన్న తాయిలాలకు, ప్రెస్ మీట్లలో ఇచ్చే ‘కవర్ల’కు ఆశపడితే సామాన్య ప్రజలు మనల్ని నమ్ముతారా”నాయకుల అక్రమాలను చూస్తూ మౌనంగా ఉంటే.మనం సమాజానికి ద్రోహం చేసినట్లే. పాలకుల అవినీతిని నిలదీసి, వారి గుండెల్లో వణుకు పుట్టించినప్పుడే సమాజంలో విలేకరికి ఒక గౌరవం, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది.విలేకరులారా.మన కలం పవర్ ఏంటో చూపిద్దాం! ఇకనైనా భజన బ్యాచ్‌ ముసుగు తీసేసి.నిజమైన చైతన్యంతో కదంతొక్కాలి.అధికార పార్టీ బెదిరింపులకు, కేసులకు లొంగిపోయే ప్రసక్తే లేదు భయపడేది లేదు.భజనలకు స్వస్తి చెప్పి నాయకుల మెప్పు కోసం తాపత్రయపడటం ఆపేసి,ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.​సవాల్ విసరాలి అవినీతి పరుల గుట్టు రట్టు చేసి, వారి అసలు స్వరూపాన్ని సమాజం ముందు నగ్నంగా నిలబెట్టాలి.జర్నలిజం అంటే కేవలం ఐడెంటిటీ కార్డులు తగిలించుకుని తిరగడం కాదు;అదొక నిప్పుల కొలిమి! పాలకుల అవినీతిపై మన కలం ఎప్పుడైతే బాణంలా దూసుకుపోతుందో, అప్పుడే నిజమైన పత్రికా స్వేచ్ఛ సిద్ధిస్తుంది. విలేకరులారా.చేతకాని వాళ్లలా నేతల వెనుక తిరగడం ఆపేసి, ప్రజా పక్షాన నిలిచి సింహంలా గర్జించండి!