prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 1:57 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను కల్పించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ – సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 

ఘట్కేసర్ ఏప్రిల్ 14 (ప్రజావాణి)

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం సర్కిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఏప్రిల్ 14 మంగళవారం రోజు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇటువంటి మహానీయుల చరిత్రను భావితరాలకు తెలియచెప్పేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు అని సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్తని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు యువకులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.