
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16)కలసపాడు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయం నందు ఏప్రిల్ 17న అనగా నేడు గురువారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీవో మహబూబ్ బి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 13పంచాయతీలలోమహాత్మా గాంధీ జాతీయగ్రామీణఉపాధి హామీపథకంఅమలులోభాగంగా 01.04.2024 నుండి 31.03.2025 వరకు జరిగిన పనులపై 19వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడమైనది .ఈ సామాజిక తనిఖీల సందర్భంగా గుర్తించిన అంశాలపైప్రజలు మరియుప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులతో చర్చించుటకు అవకాశం ఉంటుందని ఎంపీడీవో తెలిపారు .ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు మరియు ఉపాధి కూలీలు మరియు మెట్లు మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎంపీడీవో మహబూబ్ బి తెలిపారు.