prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:07 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నేడు చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం

చెంగిచెర్ల, జూలై 31: ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించేందుకు చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎస్. స్వాతి తెలిపారు.

డిపో పరిధిలోని వివిధ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రయాణికులు నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు డిపో మేనేజర్ సెల్ నంబర్ 78930 88433కు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలను తెలియజేయాలని కోరారు. అందిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ ఎస్. స్వాతి తెలిపారు.