prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:19 pm Digital Edition : PRAJA VANI

*నెహ్రు నగర్ మేకల బండ పార్క్ టు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు.*<br>

*నెహ్రు నగర్ మేకల బండ పార్క్ టు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు.*

*పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ మోహన్ రావు గురు ప్రసాద్ వెంకటేశ్వరరావు*

*ఖమ్మం టౌన్ ప్రతినిధి మన ప్రజావాణి ఏప్రిల్ 14*

నెహ్రు నగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి  డాక్టర్ మోహన్ రావుఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరణలో పెట్టాలని సూచించారు.అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ సమాజానికి మార్గదర్శకమని, వివక్షలను తొలగించి సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్ వెల్లంకి వెంకటేశ్వరరావు జె వెంకటేశ్వరావు మోదుగు మోహన్ రావు మంగళపూడి వెంకటేశ్వర్లు బొడ్డు వెంకటేశ్వర్లు పార్క్ సీపర్ లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.