prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:52 pm Digital Edition : PRAJA VANI

నెల్లికుదురు లో 27 నుంచి 29 వరకు విత్తన మేళ

నెల్లికుదురు లో 27 నుంచి 29 వరకు విత్తన మేళ

ప్రజావాణి,నెల్లికుదురు: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం నెల్లికుదురు రైతు వేదికలో ఈనెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు విత్తనమేళ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన మేళాలో ప్రస్తుత ఎల్ నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయడానికి అనుకూలమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.ఆరుతడి పంటలైన పెసర, కంది,మినుము,వేరుశనగ విత్తనాలు రైతు వేదికలో లభిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల ఎంపిక, సాగు యాజమాన్యం, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన శాస్త్రీయ సూచనలపై వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అవగాహన పొందవలసిందిగా రైతులను కోరారు.