ఘట్కేసర్, జూలై 26 (ప్రజావాణి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు ఘట్‌కేసర్ నుంచి కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బయలుదేరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పటికీ మిగిలిన పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ కాజా మోయినుద్దీన్, మాజీ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, ఘట్‌కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఫారుక్ బేగ్, ఘట్‌కేసర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ అద్దిన్, మహమ్మద్ రహమాన్, కమార్, ముక్తార్ అహ్మద్, సోయెబ్, అక్బర్, ఆఫాన్, జహీర్, అల్లా బకాష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.