నూతన సీఐ జగన్నాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
ఘట్‌కేసర్, జూలై 29: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఐ జగన్నాథ్‌కు పుష్పగుచ్ఛం అందించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటేష్, మల్కాజిగిరి పార్టీ అడ్డా కమిటీ సభ్యుడు వేముల సంజీవ్ గౌడ్, నాగారం డివిజన్‌కు...