prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 4:44 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

నూతన సీఐ జగన్నాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు

ఘట్‌కేసర్, జూలై 29: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన సీఐ జగన్నాథ్‌కు పుష్పగుచ్ఛం అందించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటేష్, మల్కాజిగిరి పార్టీ అడ్డా కమిటీ సభ్యుడు వేముల సంజీవ్ గౌడ్, నాగారం డివిజన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ అడ్డా కమిటీ సభ్యుడు కొండ జంగారెడ్డి, పోచారం ఐటీ కారిడార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ మాజీ అధ్యక్షుడు సామల జగన్మోహన్ రెడ్డి, కొండాపూర్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.