నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

ఘట్‌కేసర్, జూలై 3: నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం తొలి రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, గోపూజ, యాగశాల ప్రవేశం, వాస్తుపూజ, వాస్తుహోమం, పంచగవ్య ప్రాశనం, కలశ స్థాపన, నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాములు గౌడ్, మాడ శ్యాం కుమార్, యాదగిరి, కంబాల ఎల్లయ్య, చౌదరి ఉమా, అనసూయ, కిష్టయ్య, రాజు, కురుపాచారి,...