prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:00 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

ఘట్‌కేసర్, జూలై 3: నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం తొలి రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, గోపూజ, యాగశాల ప్రవేశం, వాస్తుపూజ, వాస్తుహోమం, పంచగవ్య ప్రాశనం, కలశ స్థాపన, నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్. రాములు గౌడ్, మాడ శ్యాం కుమార్, యాదగిరి, కంబాల ఎల్లయ్య, చౌదరి ఉమా, అనసూయ, కిష్టయ్య, రాజు, కురుపాచారి, మధు, లావణ్య, యాదమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అలాగే పంతులు తిరుమలాచారి బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించింది.

ఈ వేడుకల్లో సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సీపీఐ సీనియర్ నాయకులు కల్లూరు జైచంద్రతో పాటు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగింది.