నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
-దివాకర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే.
రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూన్ 17
రామగిరి మండల పరిధిలో జరిగిన బి అర్ ఎస్ పార్టీ నాయకుడు బొగిరి దివాకర్ నూతన గృహ ప్రవేశ వేడుకకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని,గృహ దివాకర్ మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్త ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక ప్రజలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించి,ఆయనతో కలిసి ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమంలో స్థానిక బి అర్ ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.గృహ ప్రవేశ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆత్మీయంగా జరిగింది.