prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 8:48 am Digital Edition : PRAJA VANI

నూతన ఎస్సైకి మర్యాదపూర్వక స్వాగతం<br>

*నూతన ఎస్సైకి మర్యాదపూర్వక స్వాగతం*

మన సమగ్ర ప్రజావాణి జూన్ 20 సంగారెడ్డి జిల్లా ప్రతినిది

అందోల్ మండలంలోని జోగిపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై గిరి శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, బీర్ల శంకర్, ఖాజా పాషా, ఆకుల శంకర్, దాసరి దుర్గయ్య, కరుణాకర్, రమణ, రఫీక్, గోపాల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు నూతన ఎస్సైకి సూచించగా, ప్రజల సహకారంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎస్సై గిరి శ్రీకాంత్ తెలిపారు.