prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 4:34 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నీళ్ల బకెట్ లో పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి

 వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) బి కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మున్నె ల్లి కేశవయ్య మనవడు. మరియు తండ్రి. మున్నె ల్లి చిన్న గురయ్య. సుమతి గార్ల కుమారుడు మూడు సంవత్సరాల బాలుడు నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. ఇది చూసిన గ్రామస్తులు కూడా దుఃఖానికి లోనై ఉన్నారు. విషయం తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ కుమార్ రెడ్డి. బి కోడూరు మండల అధ్యక్షుడు ఓకిలి రామచంద్రారెడ్డి. వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.