నీరు.. సమానత్వానికి ప్రవహించే దారి”నీటి వెతుకులాటలో స్త్రీల జీవితాలు

ప్రజావాణిన్యూస్(మార్చి22)ప్రపంచ నీటి దినోత్సవం తెల్లవారుజామున నాలుగు గంటలు.ఇంకా చీకటి వీడలేదు.ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఆమె నిద్ర లేచింది.ఆమె మొదటి పని–కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి బావికి పయనం.తలపై కుండ,చేతిలో పిల్లవాడు.ఈ చిత్రం భారత దేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళల దైనందిన జీవితం అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల మంది ప్రజలకు ఇంటి ఆవరణలో తాగునీరు అందుబాటులో లేదు.ఈ పరిస్థితిలో మూడింట రెండు వంతుల కుటుంబాల్లో నీటి సేకరణ బాధ్యత మహిళలదే. 53 దేశాల్లోని గణాంకాలు చెప్పేదేమిటంటే,మహిళలు,బాలికలు అందరూ...