నీట్-2026 పేపర్ లీకేజీపై ఏఐవైఎఫ్ ఆందోళన – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): నీట్-2026 పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ అంబేద్కర్ కూడలి వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, మే 3న నిర్వహించిన...