నీట్ పేపర్ లీక్ ఘటనపై పోచారంలో యువజన కాంగ్రెస్ నిరసన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం.. జాతీయ రహదారిపై బైఠాయింపు

పోచారం, జూలై 23: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొమ్మక అజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజ్జు, రాష్ట్ర కార్యదర్శి చంద్రిక, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బండ్లగూడ క్రాంతి గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల...