నిరుద్యోగ సంక్షోభంపై సమగ్ర విధాన మార్పులు అవసరం. ఘనంగా ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం
ఘట్‌కేసర్, మే 3 (ప్రజావాణి): నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే సమగ్ర విధాన మార్పులు అత్యవసరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని పోరాట దినంగా నిర్వహిస్తూ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద ఆదివారం యువజన సంఘ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ధర్మేంద్ర, ఏఐవైఎఫ్...