prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 2:24 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

నిండు ప్రాణాలు బలిగొంటున్న అక్రమ మైనింగ్- కాకాణి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న  అక్రమ గ్రావెల్,అక్రమ ఇసుక ,అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టి,అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల స్థానిక ప్రజలతో కలిసి నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి ప్రాంతంలో ఉన్న జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో  మైనింగ్ అధికారి డిప్యూటీ డైరెక్టర్,ని కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి,కందలపాడులో తవ్వి తరలిస్తున్న గ్రావెల్ క్వారీకి అనుమతుల కాల పరిమితి అయిపోయిందని కాకాణి ముందు స్వయంగా ఒప్పుకున్న మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ అనుమతులు లేకుండా ఏఎంఆర్ సంస్థ అక్రమ రాయల్టీ వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంఆర్ సంస్థకు అక్రమంగా రాయల్టీ వసూళ్ళు చేసుకునే హక్కు ఎక్కడిది? ఎవరిచ్చారు అధికారం అని అధికారులను నిలదీసిన ఏ ఎం ఆర్ సంస్థ మైనింగ్ శాఖ అనుమతులు లేనిచోట వసూలు చేసే అధికారం లేదని కాకాణి కి తెలిపిన మైనింగ్ శాఖ అధికారి సామాన్యుల బెదిరించేందుకు పోలీసుల అవతారమెత్తిన ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మైనింగ్ శాఖ అధికారులను కోరిన నెల్లూరు జిల్లాలో,ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని పేర్కొన్న కాకాణి- కందలపాడులో తరతరాలుగా పేదలు నమ్ముకుని సాగు చేసుకుంటున్నా భూములను గ్రావెల్ మాఫియా కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కాకాణి- సోమిరెడ్డి నెలకు 15 లక్షల నుండి 20 లక్షలు పేదల కడుపు కొట్టి కందలపాడు మైనింగ్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు-సోమిరెడ్డి తాను కందలపాడు గ్రామంలో అక్రమ వసూళ్లకు పాల్పడడం లేదని దేవుని ముందు ప్రమాణం చేసి, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన కాకాణి అక్రమ మైనింగ్‌కు సంబంధించిన అన్ని వివరాలను, ఆధారాలతో సహా జిల్లా మైనింగ్ శాఖ అధికారి (డీడీ) కి అందజేసి,తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం గత నెల రోజు క్రితం నేను కందలపాడు గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మైనింగ్ మాఫియా దోపిడీ నన్ను తీవ్రంగా కలచివేసింది- తరతరాలుగా వరి పండించుకుంటూ,నిమ్మ తోటలు మరియు చిన్న చిన్న కూరగాయల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద రైతుల భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీకి జరుగుతుంది- సోమిరెడ్డి గ్రావెల్ ముఠా కందలపాడు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుంది .కందలపాడు అక్రమ గ్రావెల్ తరలింపుపై మైనింగ్ అధికారులను నిలదీస్తే దానికి సంబంధించిన ఆపరేషన్స్ అనుమతి (కన్సెంట్) 30 ఏప్రిల్ 2026 తో ముగిసిపోయిందని అధికారులు అంగీకరించారు- కందలపాడుకు ఇచ్చిన మైనింగ్ అనుమతుల గడువు గత నెల తోనే ముగిసిపోయినా మైనింగ్ ను ఎందుకు సాగిస్తున్నార కందలపాడు లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేసిమైనింగ్ మాఫియా పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలికందలపాడు గ్రామంలో ఇప్పుడు తవ్వి తరలిస్తున్న,గ్రావెల్ మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది అక్రమ మైనింగ్ ను గ్రామస్తులు అడ్డుకోవాలని,గ్రామస్తులకు సూచించా,అవసరమైతే నేను వెళ్లి గ్రామస్తులకు అండగా నిలుస్తా అక్రమ గ్రావెల్ పై మైనింగ్ శాఖ అధికారులను అడిగితే, వాళ్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమ్ములుతున్నారు అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులను పోలీసులు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు- పోలీస్ అధికారుల వైఖరిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కందలపాడులో పేదల పొట్టకొట్టి చేస్తున్న ఈ అక్రమ మైనింగ్‌లో సోమిరెడ్డికి 40% వాటా ఉందా లేదా సమాధానం చెప్పగలడా కందలపాడు మైనింగ్ ద్వారా సోమిరెడ్డి నెలకు రూ.15 నుండి 20 లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్న మాట వాస్తవం కాదా అని సోమిరెడ్డిని అడుగుతున్నా- సోమిరెడ్డి చేస్తున్న అనేక అవినీతి పనులపై ప్రమాణం చేయమని అడిగా చేయలేదు ,ఈ కందల పాడు అంశంపై  ప్రమాణం చేయడానికి సోమిరెడ్డి సిద్ధమా అని సవాల్ విసురుతున్నా-కందలపాడు పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులు చూస్తే నాకు అత్యంత హృదయవిదారకంగా అనిపించింది-ఎంతటి కఠిన హృదయులైనా సరే,కందలపాడు బాధితుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు- తరతరాలుగా కందలపాడు భూములను నమ్ముకుని జీవిస్తున్న పేదల కడుపులు కొడుతూ,వాళ్ళ నోట్లో మట్టి కొడుతూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు నిబంధనలతో కానీ,క్వారీ అనుమతులతో కానీ సంబంధం లేకుండా ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా నేరుగా రాయల్టీ వసూలు చేస్తోంది చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌లకు నెలవారీ ముడుపులు చెల్లించడానికే ఏఎంఆర్ సంస్థ దోపిడీకి పాల్పడుతున్నారు-పేదవాడు తన పొలానికి ఒక ట్రిప్పు మట్టి తోలుకోవాలన్నా లేదా ఇళ్ల నిర్మాణానికి లెవలింగ్ చేసుకోవాలన్నా కూడా ఏఎంఆర్ సంస్థ అక్రమంగా రాయల్టీ వసూలు చేస్తూ సామాన్యులను పీడిస్తోంది- మైనింగ్ అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం వల్ల తాటి చెట్టు లోతు గుంతల్లో పడి జంతువులు,మనుషులు,ప్రాణాలు కోల్పోతున్నారు- నిబంధనల ప్రకారం కేవలం అనుమతి ఉన్న చోట మాత్రమే రాయల్టీ వసూలు చేయాల్సిన ఏఎంఆర్ సంస్థ,జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు తమ వాహనాలకు’పోలీస్’స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారు మైనింగ్ లేదా పోలీస్ అధికారులకు ఉండాల్సిన అధికారాలను ఏఎంఆర్ ప్రతినిధులు చేతుల్లోకి తీసుకుని,వాహనాలను అడ్డగించి బలవంతంగా పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు- జిల్లాలో విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్న ఏఎంఆర్ సంస్థ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి- జిల్లాలో అనంతసాగరం,బుచ్చి,సంగం తెలుగురాయపురం, రాజుపాలెం ఇసుక రీచ్ ల దగ్గర నుండి, సర్వేపల్లి నియోజకవర్గంలోని విరువూరు,సూరాయపాలెం ఇసుక రీచ్‌ ల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారు- విరువూరు ఇసుక రీచ్ లో సంగం పెట్రోల్ బంకుకు సంబంధించిన ఫోన్ పే క్యూఆర్ కోడ్ ని పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు,వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మీడియా ముందు చూపించా సూరాయపాలెం ఇసుక రీచ్ లో క్వారీ నిర్వాహకుల నిర్వాకం వల్ల ఇసుక గుంటలో పడి ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యకి చనిపోతే, పోలీసులు దాన్ని కేవలం ‘ప్రమాదవశాత్తు జరిగిన మరణం’గా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు- అదే ఇసుక రీచ్ లో గోదావరి జిల్లాకు చెందిన ఒక కూలీ కూడా బలయ్యాడు,ఆ రెండు కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి,ఈ ఘటనలపై పోలీసులు మసిపూసి మారేడుకాయ చేశారు- సహజ సంపద దోపిడీ విషయం లో కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండటం వల్లే పేదలకు సంబంధించిన భూములు సైతం నేడు కొల్లగొట్టబడుతున్నాయి జిల్లాలో ఇష్టారాజ్యంగా కాలువలు,చెరువులు,వాగులలో,ఇసుక,మట్టి,గ్రావెల్ తవ్వేస్తూ,ఇప్పుడు కొత్తగా ఏపీ జెన్కో నుండి బూడిదను కూడా అక్రమంగా తరలిస్తున్నారు- కూటమి నాయకులు నెల‌కు కోట్ల రూపాయలు సంపాదిస్తూ,పేద ప్రజల భూములను లాక్కుని అక్రమంగా గ్రావెల్ ఇసుక,మట్టి తవ్వేస్తున్నారు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై రాబోయే రోజుల్లో అన్ని విధాల విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం దోపిడి ముఠాతోపాటు,అధికారుల ఆగడాలపై ఆధారాలతో సహా లోకాయుక్త గ్రీన్ ట్రిబ్యునల్  మరియు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం- అధికారులు జిల్లాలో ఉన్న అవినీతి అక్రమాలను అరికట్టడం మానేసి, వాటిని ప్రశ్నించే వారిని అణచివేయాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది- కందలపాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌లో సోమిరెడ్డికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయి ఒకవేళ తాను మామూళ్లు తీసుకోవడం లేదని భావిస్తే,సోమిరెడ్డి ప్రమాణం చేయడానికి రావాలి సోమిరెడ్డి ఈ అక్రమ మైనింగ్‌లో నెలకు 40 శాతం వాటా పెట్టుకుని,రూ. 15 లక్షల నుండి రూ.20 లక్షల వరకు దండుకుంటున్నాడు- అక్రమ మైనింగ్ వల్ల అక్కడ ఉన్న పేద ప్రజలు,మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,కనీసం పశువులు వెళ్ళడానికి కూడా దారి లేకుండా చేశారు- 2014  2019 లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కందలపాడు క్వారీకి అనుమతులు వచ్చాయి- 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా కందల పాడు గ్రామస్తుల కోరిక ప్రకారం,వారికి నష్టం కలగకుండా గ్రావెల్ క్వారీ లో తవ్వకాలు జరపకుండా అడ్డుకున్నాం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందలపాడులో గ్రావెల్ మైనింగ్ ను ప్రారంభించారు- అక్రమ మైనింగ్ దారులపై మరియు వారికి సహకరిస్తున్న వారిపై మైనింగ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి  కందలపాడు గ్రామానికి చెందిన పేదరైతుల భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదు. అధికార బలంతో రైతుల పొట్ట కొట్టాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.