prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:27 am Digital Edition : PRAJA VANI

నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు ప్రారంభించిన

నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో చుక్కలు ప్రారంభించిన

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)

జమ్మికుంట బస్టాండ్ ఆవరణంలో మరియు పాత మున్సిపల్ కార్యాలయంలో  పలు చోట్ల పోలియో చుక్కలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్  మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2026 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు జూన్ 28వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం అప్పుడే పుట్టిన చంటి పిల్లలు 0నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం పోలియో బూత్‌లలో ఆసుపత్రులుఅంగన్‌వాడీ కేంద్రాలు బస్టాండ్ రైల్వే స్టేషన్ మొదలైనవి చుక్కలు వేయించుకోని వారి కోసం ఆరోగ్య కార్యకర్తలు రాబోయే 2-3 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయిస్తారు గతంలో సాధారణ టీకాలు వేయించినప్పటికీ భవిష్యత్తులో వచ్చే ప్రమాదం నుండి పూర్తి రక్షణ కోసం ఈ అదనపు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు భద్రత చేకూర్చండి అని తెలిపారు ఈ స్థానిక కౌన్సిలర్స్ చింతల శ్రీనివాస్.మాచర్ల రాజు శ్రీపతి స్వర్ణలత నరేష్ మంద రాధా కొలుగూరిసురేష్ చుంచు రమాదేవి వైద్యురాలు చందన ఏఎన్ఎం లు ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు