*నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాట చండూరులో పుట్టింది*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
దాశరథి కృష్ణమాచార్యులు రచించిన అగ్ని ధార చండూరు సాహితీ మేఖల సంస్థ అచ్చు వేసిందని ఆ సంస్థ వ్యవహర్త, తెలుగు భాష ఉపాధ్యాయులు మద్దోజు సుధీర్ బాబు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుర్తు చేశారు. 1949లో దాశరథి రచనలను సేకరించి, నిజాం నవాబును ఎదిరించి చండూరు సాహితీమేఖల అగ్ని ధార పుస్తకం అచ్చు వేయడం సాహసోపేతమైన కార్యక్రమమని అన్నారు. ‘ఆ చల్లని సముద్ర గర్భం…’ అనే పాట, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే నినాదం అగ్ని ధార వల్ల చండూరుకు చెందింది కావడం గర్వకారణం అన్నారు.అగ్నిధార పుస్తకం లో దాశరథి చేతి వ్రాతను కూడా అచ్చు వేయడం విశేషం. చండూరు మున్సిపాలిటీ అంగడిపేటకు చెందిన డాక్టర్ ఇడికుడ సచ్చిదానందం భార్య సరిత సాహితీ మేఖల సంస్థపై పి హెచ్ డి కోసం సిద్ధాంత గ్రంథం రాస్తున్నారు.