నాసిరకం డ్రైనేజీ పనులు: చిన్న వర్షానికే కుంగిన స్లాబ్,విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
పోరుమామిళ్ల (జూన్ 06) ప్రజావాణి మండలం రంగసముద్రం పంచాయతీ పరిధిలోని ఐ ఆర్ సి (IRC) లాడ్జ్ ఎదురుగా ఉన్న తిరుమల డైరీ వద్ద నిర్మించిన డ్రైనేజీ కాలువ పనుల నాణ్యత లోపం స్పష్టంగా బయటపడింది. శనివారం కురిసిన స్వల్ప వర్షానికే ఇక్కడి డ్రైనేజీ కాలువపై వేసిన స్లాబ్ పెద్ద గండి పడి కుంగిపోయింది. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే స్లాబ్ విరిగిపోయిందంటే,ఈ నిర్మాణ పనులు ఎంత నాసిరకంగా జరిగాయో అర్థమవుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదకరంగా మారిన రహదారి:ఈ మార్గంలో...