prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 12:30 pm Digital Edition : SRINIVAS RAMAGUNDAM

నాలుగు జిల్లాల ఎలక్షన్స్ పర్యవేక్షణ చేసిన అధికారి

  • జగిత్యాల , మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ల మునిసిపల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి, పురపాలక పరిపాలనా శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బుధవారం రామగుండం సoదర్శించారు.
    ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ,రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణశ్రీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రామగుండం నగర పాలక సంస్థ చేసిన ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఎలక్షన్ మెటీరియల్ రిసెప్సన్ కౌంటర్ తో పాటు ఎన్ టి పి సి టౌన్ షిప్ లోని సెయింట్ కేర్ పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రo, ఓట్ల లెక్కింపు కేంద్రమైన గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి వి రామన్, ఎ సి పి శ్రీహరి, టి పి ఎస్ నవీన్ తదితరులు ఉన్నారు.