నారాపల్లి యూ-టర్న్ వద్ద గుంతల పూడ్చివేత…వెంటనే స్పందించిన ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల హర్షం
ఘట్కేసర్, ఆగస్టు 2: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నారాపల్లి యూ-టర్న్ సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఘట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై. రవీందర్, ఎస్‌ఐ సోమయ్య తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు కాంట్రాక్టర్ నరేందర్‌ను తక్షణమే పిలిపించి గుంతలను డాంబర్‌తో పూడ్చివేయించారు. మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలు సాఫీగా...