నారపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాల ప్రారంభం ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
ఘట్‌కేసర్, జూలై 3: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ పరిధిలోని నారపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత బాలుర పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు బద్దం నరసింహారెడ్డి ఉచితంగా అందజేసిన సీసీ కెమెరాలను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పాఠశాలకు సీసీ కెమెరాలను విరాళంగా...