నారపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ…. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
ఘట్కేసర్, జూలై 15: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని...