వరికుంట్ల జూన్ 22ప్రజావాణి గ్రామం భూమిలేని నిరుపేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాశినాయన మండల పరిధిలోని నాయన అక్కింగుండ్ల రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు వందల ఎకరాలు భూకబ్జా దారులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు.ఆ భూములను వెంటనే ప్రభుత్వ రెవెన్యూ ఉన్నత అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కాశి నాయన మండలం,నాయన పల్లె రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 217 230 231 232 233 లో దాదాపు 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని గత వైసిపి పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సమీప బంధువులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అకెంగుండ్ల రెవెన్యూ గ్రామంలొ హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసులరెడ్డి 200 ఎకరాలు ప్రభుత్వ భూమి తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకుని అనుభవిస్తున్నాడు.ఆ భూమిని సమగ్రమైన విచారణ జరిపించి భూమి స్వాధీనం చేసుకోవాలని కోరారు.గత పది సంవత్సరాల నుంచి కాశినాయన మండలం నాయన పల్లె అక్కింగుండ్ల సావిశెట్టి పల్లె రెవెన్యూ గ్రామాలలో భూ కబ్జాదారులు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను వందల ఎకరాలు ఆక్రమించుకుంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రెవెన్యూ అధికారుల కు స్థానిక ప్రజలతో వినతిపత్రాలు ధర్నాలు నిరాహా దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరించారు అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డేవిడ్ కాశినాయన మండల అధ్యక్షులు వరికుంట్ల బాబు నరసయ్య సాయి పీరా వలి రాజు
రామకృష్ణ మహాలక్ష్మి గురమ్మ చిన్న లక్ష్మమ్మ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు