prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:42 am Digital Edition : PRAJA VANI

నాచుపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు… విన్యాసలతో అలరించిన విద్యార్థులు

*నాచుపల్లి ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు… అలరించిన విద్యార్థులు విన్యాసాలు.*

నస్రుల్లాబాద్ ఆగస్టు 7 (ప్రజావాణి ) నస్రుల్లాబాద్ మండలం పరిధిలో నాచుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఆషాడ మాస బోనాల ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి బోనం ఎత్తే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు.. బోనాలు ఎత్తుకొని పులి వేషాలు. పోతరాజుల వేషాలు. ధరించి డప్పు కోలహాలంతో సందడి చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్, ఎంఈఓ చందర్ మండల పిఆర్టియు అధ్యక్షులు గునిగిరి హనుమాన్లు,. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.