సమాజ సేవలో మ్యాకల కనకయ్య సేవలు అభినందనీయం – సర్పంచ్ భవాని, బాలకిషన్,ఉప సర్పంచ్ సుధాకర్,
సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ప్రజావాణి
సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారని నరసమ్మ శరదయ్య కుమార్తె నవవధువు సుప్రియ వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన, బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ. సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని అన్నారు, నూతన వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు, అనంతరం గ్రామ సర్పంచ్ భవాని బాలకిషన్, ఉప సర్పంచ్ జుట్టు సుధాకర్ మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్, సేవలు అభినందనీయమని, తన వద్దకు వచ్చిన వాళ్ల కి అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, బంగారం ధర కొండెక్కిన తన మంచితనాన్ని చాటుకుని నవవధువుకు పుస్తె మెట్టెలు అందజేయడం సంతోషం అని అన్నారు.