
గుంటూరు జూన్ 7 ప్రజావాణి నేర నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కౌన్సిలింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: నల్లపాడు పోలీస్ వారు.గుంటూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు నల్లపాడు పోలీస్ వారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.రౌడీ షీటర్లు తన నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని, నల్లపాడు పోలీస్ వారు ర్రౌడీషిటర్లకు సూచించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులకు పాల్పడిన ఇటువంటి నేరాలకు, పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లను హెచ్చరించారు.