prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:37 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

*విల్లేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి – జిల్లా ఎస్పి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విల్లేజ్ పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామ స్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.
దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి, పగలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, ముఖ్యంగా హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పి వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బి సీఐ ఆది రెడ్డి, 2టౌన్ సీఐ రాఘవ రావు, రూరల్ ఎస్.ఐ సైదా బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.