నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ తో యువతకు సువర్ణావకాశం సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్*

మే 16(ప్రజావాణి):హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ,నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ 2026 ప్రస్తుతం కోదాడ క్రికెట్ అకాడమీలో అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులు, యువ క్రీడాకారులు ప్రతిరోజూ క్రమశిక్షణతో, అంకితభావంతో క్రికెట్‌లోని మెళుకువలను నేర్చుకుంటూ తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. ఈరోజు కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు జబ్బార్ క్రీడాకారులకు ఫ్రూట్స్ అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ఈ చిన్నారులే రేపటి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు...