మే 16(ప్రజావాణి):హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ,నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ 2026 ప్రస్తుతం కోదాడ క్రికెట్ అకాడమీలో అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులు, యువ క్రీడాకారులు ప్రతిరోజూ క్రమశిక్షణతో, అంకితభావంతో క్రికెట్‌లోని మెళుకువలను నేర్చుకుంటూ తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు.
ఈరోజు కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు జబ్బార్ క్రీడాకారులకు ఫ్రూట్స్ అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ఈ చిన్నారులే రేపటి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులు కావాలి” అని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దీన్ ని అభినందించాల్సిన అవసరం ఉంది.గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, పేద, మధ్యతరగతి పిల్లలకు క్రికెట్‌లో ఉన్నత అవకాశాలు కల్పించాలని ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
కోదాడ వంటి పట్టణానికి హెచ్‌సీఏ గుర్తింపు పొందిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్‌ను తీసుకురావడం ద్వారా ఎంతోమంది క్రీడాకారులకు కొత్త దారులు చూపిస్తున్నారు. యువత క్రీడల వైపు అడుగులు వేయాలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తున్న ఆయన సేవలు నిజంగా స్ఫూర్తిదాయకం.అదేవిధంగా కోచ్ సిద్ధిఖ్ మాట్లాడుతూ, క్రీడాకారుల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దీన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“గ్రామీణ ప్రాంతం నుంచే గొప్ప క్రీడాకారులు పుడతారు… సరైన మార్గదర్శకం ఉంటే విజయాలు వారి సొంతం అవుతాయి అని పెర్కోన్నారు.