prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:34 am Digital Edition : RAJASHEKARREDDY

నర్సింహులపల్లిలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

 

బెజ్జంకి, మే 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న కులదేవత పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఐక్యత పెంపొందించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.