prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 2:48 pm Digital Edition : PRAJA VANI

నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు మొగిలి ఏకంబర్ నాయు

నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు మొగిలి ఏకంబర్ నాయుడు

బంగారుపాలెం ఏప్రిల్ 19 ప్రజావాణి: బంగారుపాళ్యం  మండల పరిధిలోని మొగిలి గ్రామంలో ఉన్న ఏకాంబరం నాయుడు మాట్లాడుతూ తనను మొగిలి గ్రామానికి చెందిన అర్చకులు మంజునాథ్ బ్లాక్ మెయిల్ చేశాడని మొగిలి గ్రామ ఎక్స్ సర్పంచ్ కుమారుడు దేవపత్ని మంజునాథ్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారని
తనను ఎవరు బ్లాక్ మెయిల్ చేయలేదని తనపై తప్పుడు ఫిర్యాదులు చేయడం మానుకోవాలని కోరారు
ఈ సందర్భంగా మొగిలి గ్రామ అర్చకులు మంజునాథ మాట్లాడుతూ మొగిలి మాజీ సర్పంచ్ కుమారుడు దేవపత్ని మంజునాథ్ తనపై మొగిలి శివయ్య భూములను  దొంగ రిజిస్టర్లు చేసి భూమిని అమ్ముకున్నానని మీడియా సమావేశం తెలిపారని ఆ భూమి తన పూర్వీకుల నుండి వచ్చినదని తను ఎలాంటి గుడి మాన్యాలు ఆక్రమించుకుని అమ్మలేదని అలా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు.మొగిలి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు గోపీనాథ్ మాట్లాడుతూ గుడి మాన్యాలను ఆక్రమించుకొని మంజునాథ్ ఇండ్లు దుకాణాలు కట్టుకొని బాడుగలకు ఇచ్చారని గతంలో తను కంటైనర్ ద్వారా ప్రభుత్వ భూములు అంగిడి పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తను రౌడీలా ప్రవర్తించి తన కంటైనర్ అంగిడి రూముని ట్రాక్టర్ ద్వారా ఢీకొని 3 లక్షల రూపాయలు సరుకులు నష్టం చేశారని 2022 లో పద్ధతిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారని ఉద్యోగంలో తొలగించినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఆకర్షితుడై 2022లో బిజెపిలో చేరి పార్టీ అభివృద్ధికి సహకరిస్తానని మొగిలి ఎక్స్ సర్పంచ్ కుమారుడు  మంజునాథ్ గతంలో వైయస్సార్ పార్టీ తరఫున గెలుపొంది తెలుగుదేశంలో చేరాడని అది గుర్తుపెట్టుకోవాలని అన్నారు సుబ్రమణ్యం మాట్లాడుతూ పెయింటింగ్ ల పేరుతో మొగిలి గోపుర వెయిటింగ్ చేస్తామని డబ్బులు లెక్కల చెప్పలేదని అనవసరంగా అర్చకులపై నింద మోపడం మానుకోవాలని అన్నారు.
తులసి రామ్ నాయుడు మాట్లాడుతూ దేవరకొండ నిధులను దుర్వినియోగం చేశాడని దీనిపై మండల అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు. మొగిలి పంచాయితీ ఎక్స్ వార్డ్ నెంబర్ సురేంద్ర మాట్లాడుతూ మంజునాథ్ గతంలో ఫ్యాక్టరీ నుండి మామూలు ఇవ్వాలని తనను కోరగా ఒకటిన్నర లక్ష రూపాయలు తీసి ఇచ్చానని ఇంకా తీసి ఒక పోవడంతో తనను ఫ్యాక్టరీని నుండి తీసేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి చేశారని పంచాయతీ నిధులు పనులు చేయకనే లక్షలాది రూపాయలు డ్రా చేశాడని అధికారులు విచారించి పంచాయతీ నిధులను రాబట్టాలని కోరారు. మొగలి గ్రామస్తులు హేమ మచంద్ర నాయుడు మాట్లాడుతూ పంచాయతీలో మొగిలి శివాలయం ఆక్రమించుకొని ఇతరులను వేధించడం మానుకోవాలని మొగిలి ఆలయం నందు అర్చకులు ఎవరు అక్రమాలకు పాల్పడలేదని ఇకనైనా నిందలు ఆపి మొగిలి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని లేకపోతే  గ్రామస్తుల నుండి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.