నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి -యువజన సమాఖ్య (AIYF) బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ “

బెజ్జంకి, జూన్ 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు.రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో మార్కెట్లో నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు విక్రయమవుతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని అన్ని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ...