
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) నందిగామ టౌన్ నందిగామ పట్టణంలో పలువురుని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు.ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నందిగామ పట్టణం 8వ వార్డు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మన్నెం దాసు ని,మరియు 1వ వార్డు అనాసాగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులగం చార్లెస్నువారి నివాసాలలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారి హాస్పటల్ రిపోర్టులను పరిశీలించి పలుఆరోగ్య సూచనలు చేశారు.