prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:32 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ధర్మారం మోడల్ స్కూల్‌లో సీట్ల భర్తీకి పిలుపు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్ల ప్రకటన విడుదలచేశారు. స్కూల్ విభాగంతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లను జులై 3న భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ వెల్లడించారు. అర్హత గల విద్యార్థులు 3వ తేదీ ఉదయం 10 గంటలకల్లా టి సి, మార్కుల జాబితా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమైన సర్టిఫికెట్లతో నేరుగా పాఠశాల క్యాంపస్‌కు హాజరుకావాలని ఆయన కోరారు.