prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 3:50 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ధర్మపురి పోలీసుల సమయస్ఫూర్తి: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి రక్షణ

కుటుంబ కలహాలతో రాయపట్నం గోదావరి వద్ద ఆత్మహత్యకు యత్నించిన జైన గ్రామానికి చెందిన వ్యక్తిని ధర్మపురి పోలీసులు సకాలంలో కాపాడారు. సదరు వ్యక్తి భార్యకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపి వెళ్లడంతో, ఆమె సీఐకి సమాచారం అందించింది. సీఐ ఆదేశాలతో ఎస్‌ఐ మహేష్, క్రైమ్ పీసీ కిరణ్ ఫోన్ లొకేషన్ ద్వారా అతడిని గుర్తించి రక్షించారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగించడంతో, పోలీసులు తెలిపిన సమయస్ఫూర్తికి బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.