ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ మండల అధ్యక్షుల నియామకం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, మే 14 (ప్రజావాణి): జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజంగి నందయ్యతో సంప్రదింపులు జరిపిన అనంతరం, నియోజకవర్గంలోని సమర్థులైన నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ధర్మపురి మండలం కు గాను చిలుముల లక్ష్మణ్, బుగ్గారం...