ద్వారకాతిరుమల కొండపై ‘నకిలీ’ కలకలం! దర్శనం టిక్కెట్ల స్కామ్‌లో ఏడుగురు నిందితుల అరెస్ట్

ఏలూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)ద్వారకాతిరుమల కొండపై 'నకిలీ' కలకలం!దర్శనం టిక్కెట్ల స్కామ్‌లో ఏడుగురు నిందితుల అరెస్ట్  ఇంజనీర్,మాజీ సూపర్వైజర్ హస్తం ల్యాప్‌టాప్, ప్రింటర్ స్వాధీనం.నిందితులకు రిమాండ్.ద్వారకాతిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల దందా బట్టబయలైంది. స్వామివారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తూ, నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి. కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి....