దొర్లబంగ్లలో మరో ప్రాణాన్ని బలిగొన్న గుడుంబా
*దొర్లబంగ్లలో మరో ప్రాణాన్ని బలిగొన్న గుడుంబా..!*-అధికారుల నిర్లక్ష్యమే అమాయకుల ప్రాణాలకు శాపమా..? మన ప్రజావాణిమందమర్రి, జూలై 3 మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొర్లబంగ్ల ప్రాంతంలో గుడుంబా మళ్లీ ఒక ప్రాణాన్ని బలిగొన్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గుడుంబా సేవించిన అనంతరం ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, గత కొన్నేళ్లుగా దొర్లబంగ్ల ప్రాంతంలో గుడుంబా సేవించడం వల్ల ఇప్పటికే దాదాపు పది మంది...