prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 12:38 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దొంగలు పడ్డ ఆరు నెలలకు గ్రామ సింహాలు అరవడం అంటే ఇదేనేమో..

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) 30 రోజుల్లోగా అందించాల్సిన సమాచారాన్ని 60 రోజులకు అందించిన ఘనత తిరుపతి జిల్లా,చిట్టమూరు రెవెన్యూ కార్యాలయం పౌర సమాచార అధికారికి చెందుతోంది.ఇలాంటి అధికారులకు సన్మానాలు, సత్కారాలు కచ్చితంగా చేయాలి.సమాచార హక్కు చట్టాన్ని బ్రష్టు పట్టించినందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ సేవ అవార్డును అందించాలి.నెల తిరిగేసరికి జీతం మాత్రం కచ్చితంగా అందుకునే అధికారి.విధి నిర్వహణలో మాత్రం ఆలస్యం చేయడం అనావాయితీగా మారింది.ప్రజలంటే చిన్న చూపు.చిదరింపు ఎందుకని.మారుమూల మండలం కావడంతో మమ్మల్ని అడిగేవారు ఎవరు.ఆపేవారు ఎవరు. అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు రెవిన్యూ కార్యాలయం సిబ్బంది.ఉన్నత అధికారులు స్పందించి చిట్టమూరు రెవెన్యూ కార్యాలయం సిబ్బంది విధి నిర్వహణలో చేస్తున్న జాప్యం గురించి సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.