దొంగతనానికి యత్నం నిందితుడికి దేహశుద్ధి

దొంగతనానికి యత్నం: నిందితుడికి దేహశుద్ధి చెన్నారావుపేట జూలై 05 ప్రజావాణి మండల కేంద్రంలోని నంబర్‌వన్ కాలనీలో శనివారం రాత్రి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.కాలనీకి చెందిన బొక్కల బుజమ్మ అనే మహిళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి కాపలాదారుగా విధులకు వెళ్లిన సమయాన్ని నిందితుడు ఆసరాగా చేసుకున్నాడు.ఇదే కాలనీకి చెందిన సాధు రాజు అనే వ్యక్తి బుజమ్మ ఇంటి తలుపులు తొలగించి లోపలికి ప్రవేశించాడు.అక్కడ విలువైన వస్తువులేవీ దొరక్కపోవడంతో, పక్కనే ఉన్న మట్టెవాడ మస్తాన్ ఇంటి తాళం...