దేశంలో సామాజిక న్యాయం సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
జమ్మికుంట, ఏప్రిల్ 5 (ప్రజావాణి): దేశంలో సామాజిక న్యాయం సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివారం సైదాపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ, దేశ రక్షణ, కార్మిక, వ్యవసాయ రంగాల్లో బాబు జగ్జీవన్ రామ్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం...